వేంసూరు, నవంబర్ 27 : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కందుకూరు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం రైతులు పామాయిల్ సాగుపై మక్కువ చూపుతున్న నేపథ్యంలో పామాయిల్ మొక్కలు అందించే క్రమంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారన్నారు. సొసైటీ పరిధిలో ధాన్యం నిల్వలకు అనుగుణంగా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం కందుకూరు, మర్లపాడు, రాయుడుపాలెంలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పగుట్ల వెంకటేశ్వరరావు, పాలా వెంకటరెడ్డి, కంటె వెంకటేశ్వరరావు, రావూరి శ్రీను, రేగళ్ళ రామకేశవ రెడ్డి, గొర్ల ప్రభాకర్ రెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, రామ్మోహన్, రంజిత్‌కుమార్, రీమా, హరిప్రసాద్ పాల్గొన్నారు.
తల్లాడ, నవంబర్ 27 : పాతమిట్టపల్లిలో శ్రీవేంకటేశ్వర బిన్ని రైస్‌మిల్‌ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు రాయల వెంకటశేషగిరిరావు, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దూపాటి భద్రరాజు, తూము వీరభద్రం, శీలం కోటారెడ్డి, కోపెల కనకయ్య, రుద్రాక్ష బ్రహ్మం, కేతేపల్లి చలపతిరావు, దూపాటి నరేశ్రాజు, కొండపల్లి శేఖర్‌బాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
యువసేవా సమితి సేవలు ఆదర్శనీయం
సత్తుపల్లి టౌన్, నవంబర్ 27 : యువసేవాసమితి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని, మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పట్టణంలోని వృద్ధులు, యాచకులకు యువ సేవా సమితి ఏర్పాట్లుచేసిన దుప్పట్లు పంపిణి చేసి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
పెనుబల్లి, నవంబర్ 27 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగపరుచుకోవాలని సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు, లంకాసాగర్ సర్పంచ్ మందడపు అశోక్‌కుమార్ కోరారు. లంకాసాగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతుల ఆర్థికాభివృద్ధిని కాంక్షించి దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నదని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో కో ఆపరేటివ్ సిబ్బంది, డైరెక్టర్లు పాల్గొన్నారు.