పేదలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని, సంక్షేమ పథకాలతో వారి కళ్లలో ఆనందాన్ని నింపుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.
- సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాల్లో ఆనందం
- ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత
తల్లాడ, మార్చి 18: బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని, సంక్షేమ పథకాలతో వారి కళ్లలో ఆనందాన్ని నింపుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదలకు వాటిని క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తున్నట్లు చెప్పారు. 58, 59 జీవోల ద్వారా మంజూరైన ఇళ్ల స్థలాల పట్టాలను అదనపు కలెక్టర్ మధుసూదన్‌రావుతో కలిసి తల్లాడ రైతువేదికలో 28 మంది లబ్ధిదారులకు శనివారం అందజేశారు.
అనంతరం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకూ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ 2020 జూన్ 1 లోపు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు దరఖాస్తు చేసుకుంటే అధికారులు సర్వే చేసి అర్హులకు పట్టాలు మంజూరు చేస్తారని అన్నారు. ఇంకా అర్హులెవరైనా ఉంటే ఏప్రిల్ 1 నుంచి మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్‌రావు మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కార్యక్రమం నిరుపేదలకు వరం లాంటిదని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారందరూ దరఖాస్తు చేసుకొని పట్టాలు పొందవచ్చని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సూర్యనారాయణ, గంటా శ్రీలత, దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, దుగ్గిదేవర వెంకట్‌లాల్, పొట్టేటి సంధ్యారాణి, జొన్నలగడ్డ కిరణ్, ఆదూరి దాసురావు, చల్లా తిరుమలాదేవి, వేమిరెడ్డి తులిశమ్మ, రావూరి పద్మ, రుద్రాక్షల బ్రహ్మం, ఆదూరి వెంకటేశ్వర్లు, దిరిశాల దాసురావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కేతినేని చలపతి, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, గుండ్ల నాగయ్య, బద్ధం కోటిరెడ్డి, షేక్ యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- distribute
- documents
- house
- khammam
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

