సత్తుపల్లి టౌన్, జనవరి 1 : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరస్వామి వారిని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం సతీసమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ దేవస్థానం వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే సండ్ర దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలను సుఖసంతోషాలతో వెలుగులు నింపేదిగా ఉండాలని, స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ అందాలని ఆకాంక్షించారు.