కారేపల్లి, అక్టోబర్ 25 : వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ శనివారం కారేపల్లి మండలంలో పర్యటించారు. గేటుకారేపల్లిలో మత్స్య సహకార సంఘంలో నూతన సభ్యత్వాల చేర్పింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంఘంలో నూతన సభ్యులకు సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సహకార సంఘాల ద్వారా లబ్ధిదారులకు సబ్సిడీలు అందిస్తుందన్నారు. సంఘాలను ఐక్యతతో నడిపించుకుంటూ అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మత్స్య సహకార శాఖ ఏడీ శివప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కారేపల్లి సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.