కారేపల్లి, సెప్టెంబర్ 26 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలంలో స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ శుక్రవారం పర్యటించారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్, అధ్యాపకుల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇటీవల కారేపల్లిలో వివిధ కారణాలతో మృతి చెందిన వారి ఇంటికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకుముందు కారేపల్లిలోని దుర్గామాత మండపాల్లో జరిగిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.