ఖమ్మం, మార్చి 19: కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే పంటలు ఎండిపోవడానికి కారణమని ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. పంటలు ఎండిపోతున్న విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తూ అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరి కంకులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. సాగునీటి వనరులు వినియోగించడం, ప్రాజెక్టులను నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని ధ్వజమెత్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని, అది కూడా కేసీఆర్పై ఉన్న ద్వేషంతో సీఎం రేవంత్రెడ్డి తెచ్చిన కరువేనని దుయ్యబట్టారు.