గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
మౌలిక వసతులు కల్పించి ప్రతి గ్రామాన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకు అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
- అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం టౌన్/ లక్ష్మీదేవిపల్లి, మార్చి 14: మౌలిక వసతులు కల్పించి ప్రతి గ్రామాన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకు అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. మండలంలోని సుజాతనగర్, నిమ్మలగూడెం, కొత్త అంజనాపురం, పాత అంజనాపురం,
నాయకులగూడెం, రాఘవాపురం, డేగలమడుగు, సీతంపేట బంజర తదితర పంచాయతీల్లో గురువారం పర్యటించిన ఆయన.. గ్రామాల్లో రూ.118.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంపైనా ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు శిరీష, వెంకటలక్ష్మి, సత్యనారాయణ, బాబు, మల్లికార్జున్, ఖాన్, శివలాల్, ఎంపీటీసీ భూక్యా పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లిలో..
మండలంలోని సంజయ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో నూతనంగా నిర్మించబోయే 21 షాపుల కాంప్లెక్స్‌కు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం శంకుస్థాపన చేశారు. మొర్రేడువాగుపై కరకట్ట నిర్మాణానికి నిధులు కేటాయించి త్వరలో పనులు ప్రారంభం చేయిస్తానని హామీ ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంకటేశ్వర్లు, బదావత్ గోవిందు, పూనెం శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

