మాయమాటలకు పాలేరులో చోటులేదు
బయటి వ్యక్తులకు, మాయమాటలకు పాలేరు నియోజకవర్గంలో చోటులేదని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పాలేరు ప్రజలెప్పుడూ మంచి చేసే వాళ్లవైపే ఉంటారని అన్నారు. ఇక్కడి ప్రజలతో తనకు పెనవేసుకున్న అనుబంధం ఉందని, వారి గుండెల్లో తన స్థానం సుస్థిరమని అన్నారు.
- ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ స్థానాన్ని ఎవరూ తొలగించలేరు
- ఖమ్మం రూరల్ పర్యటనలో బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ
ఖమ్మం రూరల్, నవంబర్ 22: బయటి వ్యక్తులకు, మాయమాటలకు పాలేరు నియోజకవర్గంలో చోటులేదని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పాలేరు ప్రజలెప్పుడూ మంచి చేసే వాళ్లవైపే ఉంటారని అన్నారు. ఇక్కడి ప్రజలతో తనకు పెనవేసుకున్న అనుబంధం ఉందని, వారి గుండెల్లో తన స్థానం సుస్థిరమని అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం పర్యటించిన ఆయన.. కేఎంసీ 1వ డివిజన్, కరుణగిరి ఏరియా, రాజీవ్ స్వగృహ కాలనీల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ ఎమ్మెల్యేకు స్థానికులు, మహిళలు ఎదరొచ్చి మంగళ హారుతుల పట్టి, పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్‌లలో కందాళ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వమని అన్నారు. గడిచిన పదేళ్లలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేసిందని గుర్తుచేశారు. మరోసారి గెలిపిస్తే మరిన్ని సంక్షేమ ఫలాలు అందిస్తుందని అన్నారు.
నూతన మ్యానిఫెస్టోలో చెప్పిన అనేక కొత్త పథకాలను ప్రజల ముంగిటకు తెస్తుందని వివరించారు. ఇన్నేళ్లలో ఏనాడూ ఇక్కడ కన్పించని నాయకులు కొందరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారని, తామే గెలుస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. మంచి చేసిన వాళ్లను ఓడిస్తామని అంటున్నారని అన్నారు. పాలేరు ప్రజలు మాయామశ్చీంద్రల మాటలకు మోసపోయేవాళ్లు కాదని స్పష్టం చేశారు. అహంకారంతో మాట్లాడే వారికి ఇక్కడ చోటు లేదని అన్నారు. కారు గుర్తు అంటే కర్షకుల గుండె చప్పుడని, దానిని ఎవరూ తొలగించలేరని స్పష్టం చేశారు. పది రోజుల షో తరువాత మాయామశ్చీంద్రల నిజస్వరూపం బయటపడుతుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బానోత్ చంద్రావతి, బెల్లం వేణుగోపాల్, అక్కినపల్లి వెంకన్న, కొండం కళమ్మ, మరికంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

