కూసుమంచి, నవంబర్ 15: రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా కొత్త మ్యానిఫెస్టోను అమల్లోకి తెచ్చుందామని, మరిన్ని సంక్షేమ పథకాలను సాధించుకుందామని అన్నారు. కూసుమంచి మండలంలో బుధవారం పర్యటించిన ఆయన.. జుఝల్రావుపేటలో జరిగిన రోడ్‌షోలో మాట్లాడారు. గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలూ పనిచేశానని, గ్రామాల్లో అనేక సమస్యలను పరిష్కరించానని, పల్లెలను అద్బుతంగా తీర్చిదిద్దానని గుర్తుచేశారు. అదే క్రమంలో ఈ ఎన్నికల్లోనూ నియోజకవర్గ ప్రజల సహకారం తనకు కావాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ..
పాలేరు నియోజకవర్గ ప్రజలతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, 30 ఏళ్లపాటు వారితోకలిసి పని చేశానని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను గెలిపించుకోవడం ద్వారా వాటి ఫలాలను మరింతగా పొందవచ్చునని అన్నారు. బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చంద్రావతి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరిందని అన్నారు. మరో సమన్వయకర్త తాళ్లూరి జీవన్ మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధితోనే రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోందని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రామసహాయం బాలకృష్ణారెడ్డి, బానోత్ శ్రీనివాస్, ఇంటూరి బేబీ, ఇంటూరి శేఖర్, బానోత్ సరస్వతి, మందడి పద్మ, కుంభం రమణ, వేముల వీరయ్య, కంచర్ల వీరారెడ్డి పాల్గొన్నారు.