సత్తుపల్లి, డిసెంబర్ 10 : సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.70 కోట్లు మంజూరయ్యాయి. దీంతో శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలిసి శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు చేయడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం చేశారు. నియోజకవర్గ ప్రజల తరఫున సండ్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.