భద్రాచలం, జనవరి 18 : అశ్వారావుపేట సమీపంలోని గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరికెల్ల తిరుపతిరావు, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, చింతాడి చిట్టిబాబు, ఎండీ నవాబ్, కార్మిక శాఖ అధ్యక్షుడు చుక్కా సుధాకర్, యూత్ అధ్యక్షుడు గాడి విజయ్, కార్యదర్శి ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, మాచినేని భాను, ఎండీ సుభాని, అవులూరి దుర్గాప్రసాద్, గాడి రాజేశ్ ఉన్నారు.