ఖమ్మం : జిల్లాలో మైనారిటీ విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరానికి నేషనల్ మైనార్టీస్ ఫ్రీ మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి), పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్మీడియట్ నుంచి పి.హెచ్.డి గవర్నమెంట్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలు, ఐ.టి.ఐ లేదా ఐ.టి.సి టెక్నికల్ కోర్సులు, గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాలకు నూతన, రెన్యువల్ కోసం ఆన్ లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనదని పేర్కొన్నారు. సంబంధిత విద్యార్ధులు, పాఠశాల, కళాశాలలు వెబ్ సైట్ https://scholarships.gov.in ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు జిల్లా మైనార్టీస్ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించి అవకాశాన్ని మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.