ఖమ్మం, జూలై 10: ఎవరో సన్నాసులు అన్నట్లుగా ‘పువ్వాడ’ అనే పేరు వాడల్లో లేదని.. ప్రజల గుండెల్లో ఉన్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. అభివృద్ధిని చూడలేని సన్నాసులే ఇలాంటి విమర్శలు చేస్తుంటారని చురకలంటించారు. పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో భాగంగా లెర్నింగ్ లైసెన్స్‌లు పొందిన 240 మందికి సోమవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి నెలా 5 వేల మందికి లైసెన్స్‌లు ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు.
ఎవరో సన్నాసులు అన్నట్లుగా ‘పువ్వాడ’ అనే పేరు వాడల్లో లేదని.. ప్రజల గుండెల్లో ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. అభివృద్ధిని చూడలేని సన్నాసులే ఇలాంటి విమర్శలు చేస్తుంటారని చురకలంటించారు. 50 ఏళ్లుగా ప్రజా జీవితానికే అంకితమైన కుటుంబం తమదని అన్నారు. తాను చేసే సేవే తనకు గుర్తింపు, సంతృప్తిని ఇస్తున్నదని అన్నారు. పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో భాగంగా లెర్నింగ్ లైసెన్స్‌లు పొందిన 240 మందికి సోమవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. రవాణా శాఖ మంత్రిగా తన నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ లైసెన్స్ ఇప్పించడం గొప్ప సంతృప్తినిస్తోందని అన్నారు.
ఖమ్మం నియోజకవర్డంలో ఉన్న ప్రతి ఒక్కరికీ లైసెన్స్ ఉండాలనే ఉద్దేశంతోనే పువ్వాడ ఫౌండేషన్ ద్వారా ఈ లైసెన్స్ మేళాను చేపట్టామన్నారు. క్యాంపు కార్యాలయంలో స్లాట్ బుకింగ్ అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ప్రతి రోజూ 250 నుంచి 270 వరకు స్లాట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. డివిజన్ల వారీగా కాకుండా నియోజకవర్గంలో ఉన్న వారు ఎవరైనా వచ్చి స్లాట్ బుక్ చేసుకోవచ్చునని చెప్పారు. ఈ విషయంలో కార్పొరేటర్లు తమ డివిజన్లలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే కళాశాలల విద్యార్థులు కూడా లైసెన్స్‌లు తీసుకునేలా కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని ఆర్జేసీ కృష్ణ, వల్లభనేని రామారావులకు మంత్రి సూచించారు. ప్రతి రోజూ సాయంత్రం క్యాంపు కార్యాలయంలో లైసెన్స్ పత్రాలు పంపిణీ చేస్తామని అన్నారు. ప్రతి నెలా 5 వేల మందికి లైసెన్స్‌లు ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్‌కుమార్, కిషన్‌రావు, వరప్రసాద్, దోరేపల్లి శ్వేత, నాగండ్ల కోటి, పైడిపల్లి సత్యనారాయణ, పాల్వంచ కృష్ణ, షకీనా, తన్నీరు శోభారాణి, మెంటెం రామారావు తదితరులు పాల్గొన్నారు.