ఖమ్మం, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రం తీరుపై నిరసన జ్వాలలు ఎగిసిడుతున్నాయి. రైతులను మోసం చేస్తున్న బీజేపీ సర్కార్‌కు సెగ తగిలేలా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరి ఉద్యమం ఊరూరా రగులుతున్నది. రైతు వ్యతిరేక విధానాలపై కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమే వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరు ఉధృతం అవుతున్నది. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించారు. ప్రతి ఇంటిపై నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. బీజేపీ సర్కార్, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాద్రి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల జడ్పీ చైర్మన్లు కమల్‌రాజు, కనకయ్య, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి వెంకట్రావు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు.
ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. రైతులకు న్యాయం జరిగే వరకు పోరుబాట వీడమంటూ టీఆర్ఎస్ శ్రేణులు శపథం చేశాయి. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాయి. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించారు. ప్రతి ఇంటిపై నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. ఆయా ప్రాంతాల్లో బీజేపీ సర్కార్, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాద్రి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వర్రావు, హరిప్రియానాయక్, రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల జడ్పీచైర్మన్లు లింగాల కమల్‌రాజ్, కోరం కనకయ్య, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి కేంద్రం వైఖరిని ఎండగట్టారు. మోదీ డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
మంత్రి ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ
ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. మంత్రి బుల్లెట్ నడుపుతూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రేణులను ఉత్తేజపరిచారు. మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ప్రదర్శన జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నది. ఈ సందర్భంగా మంత్రి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. కేంద్రానికి రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బీజేపీ గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. ధాన్యం కొనే వరకు కేంద్రాన్ని వదలబోమన్నారు. 11వ తేదీన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో కేంద్రానికి వణుకు పుట్టేలా ధర్నా నిర్వహిస్తామన్నారు. రైతులను రెచ్చగొట్టి యాసంగిలో వరి వేయించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ ఇప్పుడు ముఖం చాటేశారని మండిపడ్డారు.
నియోజకవర్గాల్లో ఇలా..
సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భారీ మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. వరికంకులు, గులాబీ, నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అన్ని మండలాల్లో టీఆర్ఎస్శ్రేణులు, రైతులు ఇళ్లపై నల్లజెండాలను కట్టారు. వరికంకులు, నల్లజెండాలను ఇంటిపై ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కేంద్రం రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు.
వైరా శాసనసభ్యుడు రాములునాయక్ నాయకత్వంలో టీఆర్ఎస్శ్రేణులు పెద్దఎత్తున మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్, నల్లజెండాలతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధిర పట్టణంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నారు. ముదిగొండ మండలం మేడేపల్లిలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. కేంద్ర మంత్రి అహంకారపూరిత వ్యాఖ్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
దిష్టిబొమ్మల దహనం
భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. మణుగూరులో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో భారీ మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి నాయకత్వంలో కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, నేలకొండపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. నేలకొండపల్లిలో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు.
అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ఎస్శ్రేణులు కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. తాటిసుబ్బన్నగూడెంలో మెచ్చా నివాసం వద్ద నల్లజెండాలను కట్టి నాయకులతో కలిసి నిరసన తెలిపారు. బూర్గంపహాడ్ మండల కేంద్రంలో నాయకులు నల్లజెండాలతో నిరసన తెలిపి కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. భద్రాచలంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు నేతృత్వంలో గ్రామగ్రామానా నిరసన తెలిపారు. కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. భద్రాచలంలో మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు.