HomeKhammamMinister Ajay Was In The Vc At The End Of The Year Sambura In The Ruling Party
సుస్థిర ప్రగతి సాధించాం..
ఖమ్మం నగర అభివృద్ధికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి
పాలకవర్గం ఏడాది పూర్తయిన సంబురాల్లో వీసీలో మంత్రి అజయ్
మున్సిపల్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన కార్పొరేటర్లు, అధికారులు
ఖమ్మం, మే 7: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం పాలకవర్గ సభ్యులు సంబురాలు జరిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లుకు శుభాకాంక్షలు తెలిపారు. మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, మేనేజర్ విజయానంద్, ఆర్వో శ్రీనివాస్, డీఈ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ కూడా.. కేఎంసీ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేయర్ నీరజకు శాలువా కప్పి విషెస్ చెప్పారు.
వీడియో కాల్ ద్వారా మంత్రి శుభాకాంక్షలు
కేఎంసీ పాలకవర్గం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హైదరాబాద్ నుంచి వీడియోకాల్ ద్వారా కార్పొరేటర్లకు శుభాకాంక్షలు చెప్పి సందేశాన్ని వినిపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నేతృత్వంలో రెండో పాలకవర్గం దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకుందన్నారు. సీఎం కేసీఆర్ సహాయం, కేటీఆర్ సహకారంతో నగరాభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ రాకముందు నగరంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు అందరికీ కనిపిస్తున్నాయని అన్నారు. నగర అభివృద్ధిలో కీలకమైన తాగునీరు, కరెంటు, విద్య, వైద్యం, రవాణా వ్యవస్థ వంటి అనేక రంగాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ నాయకత్వంలో నగరాభివృద్ధి సాధనలో ఖమ్మం దూసుకెళ్తోందన్నారు. సుస్థిర అభివృద్ధిని సాధించామని మంత్రి అజయ్ పేర్కొన్నారు. ఖమ్మం ప్రగతికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, మరింత ప్రగతి సాధనకు కార్పొరేటర్లు అందరూ కార్యోన్ముఖులు కావాలని ఆకాంక్షించారు.
cwas in the VC at the end of the year Sambura in the ruling party