Minister Puvvada Ajay | సకల జనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పువ్వాడ
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం మైనార్టీ రుణాల మంజూరైన చెకులను గురువారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
- ఖమ్మంలో మైనార్టీలకు రుణాల
- పంపిణీలో మంత్రి పువ్వాడ
Minister Puvvada Ajay | ఖమ్మం, అక్టోబర్ 5: సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం మైనార్టీ రుణాల మంజూరైన చెకులను గురువారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అందిస్తున్న డ్రైవర్ కం ఓనర్ పథకం ద్వారా మంజూరైన రెండు కార్లను అందజేశారు. మైనర్టీ సంక్షేమశాఖ అధ్వర్యంలో మంజూరైన 400 కుట్టు మిషన్లను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
సీఎం కేసీఆర్ దార్శనిక పాలన, తెలంగాణలో హిందూ, ముస్లిం ఐక్యతను పటిష్టం చేస్తూ, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని తెలిపారు. మైనార్టీ శాఖ అధ్వర్యంలో 200 మంజూరు చేయగా ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్ళి ఖమ్మంలో ప్రత్యేకంగా 400 కుట్టు మిషన్లను మంజూరు చేయించి మీకు ఇస్తున్నామని పేరొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సెక్యులర్ వైఖరి, తెలంగాణలో మత సామరస్యాన్ని చాటి చెబుతోందన్నారు.
మైనారిటీల సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్రం తెలంగాణ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయలేదని వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం మళ్లీ మనకు అందాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఅర్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సత్య ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, జడ్పీటీసీ ప్రియాంక, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, పాకాలపాటి విజయనిర్మల, ఆలియ, మక్బూల్, చిరుమామిళ్ళ లక్ష్మి, దాదే అమృతమ్మ, పగడాల శ్రీవిద్య, వలరాజు, పాలేపు విజయ, అశ్రిఫ్, ఖమర్, తాజ్‌ఉద్దీన్, నాగులమీరా, షేక్ షకీన, ఇస్సాక్, టౌసిఫ్(బాబీ), షంశుద్ధీన్ తదితరులు ఉన్నారు.
జాతీయ స్థ్ధాయిలో ఖమ్మం డిగ్రీ కళాశాల అత్యుత్తమమైనది
ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 5: చారిత్రాత్మకమైన ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇటీవల న్యాక్ అక్రిడిటేషన్‌లో ఏ++ గ్రేడ్ సాధించి, రాష్ట్ర, జాతీయ స్థ్ధాయిలో అత్యుత్తమ కళాశాలగా మొదటి స్థ్ధానంలో నిలవడం అపూర్వమైన విజయమని మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. గురువారం కళాశాల ప్రిన్సిపాల్ జాకీరుల్లా అధ్యక్షతన దీక్షారంభ్-2023 ప్రథమ సంవత్సరం విద్యార్థుల అవగాహన సదస్సులో భాగంగా న్యాక్ ఏ++ సాధన- అభినందన సభలో పూర్వ విద్యార్థిగా మంత్రి పాల్గొని మాట్లాడారు.
ప్రస్తుత విద్యార్థులు అత్యున్నత కళాశాలలో చదువుతున్నామనే భావనతో సగర్వంగా చెబుతూ బాగా చదువుకొని కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తొలుత ఇటీవల కళాశాలలో సుడా నిధులతో నిర్మించిన సీసీ రోడ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థలదాత గెంటేల నారాయణరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, పగడాల నాగరాజు, రమాసత్యవతి, బివిరెడ్డి, జీవన్, డాక్టర్ సీతారాం, గవర్నింగ్ బాడీ సభ్యులు రవిమారుత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

