ఖమ్మం, జూలై 4: వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామమని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి అజయ్.. మంగళవారం ట్విట్టర్ ద్వారా సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ రీ-ఆర్గనైజేషన్ యాక్ట్ ఆర్టికల్ 371డీ నిబంధనలకు లోబడి అడ్మిషన్స్ రూల్స్‌కు సవరణ చేసినట్లు చెప్పారు. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పడిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నిర్ణయం వల్ల 20 కొత్త మెడికల్ కాలేజీలకు సమానమైన 1820 సీట్లు ఏటా రాష్ట్ర విద్యార్థులకే దకనున్నాయని అన్నారు.
సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 4: తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రారంభించిన మెడికల్ కళాశాలల్లోని సీట్లు నూరు శాతం రాష్ట్ర విద్యార్థులకే వర్తించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం రూల్స్ సవరణ చేయడం పట్ల వైద్య విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం నగరంలోని డాక్టర్స్ మెడికల్ అకాడమీ (డీఎంఏ) విద్యార్థులంతా కలిసి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, అజయ్‌కుమార్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. డీఎంఏ డైరెక్టర్లు సతీశ్‌బాబు, ఈగ భరణికుమార్ పేర్కొన్నారు.