సీఎం కేసీఆర్‌తోనే గ్రామాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో శుక్రవారం ఆయన కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి రూ.2.51 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. వీఆర్ బంజరలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. కొత్త ఆసరా పింఛనుదారులకు పింఛను ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీని ప్రజలు నమ్మడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నదన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)దే విజయమన్నారు.
రఘునాథపాలెం, నవంబర్ 4 : సీఎం కేసీఆర్‌తోనే గ్రామాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో శుక్రవారం ఆయన రూ.2.51 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి, వీఆర్ బంజరలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి, కొత్త ఆసరా పింఛనుదారులకు పింఛను ధ్రువపత్రాలు అందజేసి మాట్లాడారు. మతతత్వ పార్టీ బీజేపీని ప్రజలు నమ్మడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నదన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్)దే విజయమన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలన్నారు.
ఉమ్మడి పాలనలో మండలం అర్బన్ పరిధిలో ఉండేదని, అప్పుడు అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి అజయ్ అన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి ప్రగతి సాధించుకున్నట్లు చెప్పారు. మంత్రి వెంట ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్, డీఆర్డీవో పీడీ విద్యాచందన, పీఆర్ ఈఈ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, సర్పంచ్ చెన్నబోయిన ముత్తమ్మ, ఏఎంసీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, ఆత్మ చైర్మన్ భుక్యా లక్ష్మణ్‌నాయక్, మాజీ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్, ఎంపీపీ భుక్యా గౌరి, వైస్ ఎంపీపీ గుత్తా రవి, ఉప సర్పంచ్ ఉయ్యూరు వెంకటనారాయణ, నాయకులు నాగండ్ల భద్రయ్య, చెన్నబోయిన సైదులు, మందడపు నర్సింహారావు, మెంటెం రామారావు, చెరుకూరి ప్రదీప్, లక్ష్మణ్, సిగ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.