మధిర, ఆగస్టు 30 : ప్రజల న్యాయ వివాదాలు త్వరగా పరిష్కారం కోసం మెగా లోక్ అదాలత్ ప్రధాన వేదికగా నిలుస్తుందని న్యాయమూర్తులు ఎన్.ప్రశాంతి, వేముల దీప్తి అన్నారు. శనివారం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 13వ తేదీన జరిగే మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లపై మధిర సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెగా లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించాలన్నారు. పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.
అదేవిధంగా చిన్న చిన్న దొంగతనం కేసులు, క్షణికావేశంతో చిన్న కేసుల విషయంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి కేసుల రాజీకి ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎం.అబ్రహం, సిఐ డి.మధు, డి.రమేశ్, ఎస్ఐలు లక్ష్మి భార్గవి, రమేశ్, వెంకన్న, వెంకటేశ్, కృష్ణ, రామారావు, సి.జనార్ధన్ రెడ్డి, సాయి రామ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.పుల్లారావు, వాసంశెట్టి కొటేశ్వరరావు, రామరాజు, వి.మాధురి, తేజ పాల్గొన్నారు.