కారేపల్లి, జూలై 09 : బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి గురువారం సింగరేణి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో ఇటీవల మృతి చెందిన మాదారం గ్రామ ఉప సర్పంచ్ బానోత్ లాలు, పేరుపల్లి గ్రామానికి చెందిన బుడిగ శ్రీను, పాత కమలాపురం సర్పంచ్ దివంగత తేజవత్ బాబురావు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆమె వెంట మాజీ జెడ్పీటీసీ వాంకుడోత్ జగన్, మాజీ దిశ కమిటీ సభ్యుడు లకావత్ లక్ష్మణ్, జిల్లా మైనార్టీ నాయకుడు ఎస్కే గౌసుద్దీన్, జిల్లా నాయకులు డొంకెన రవీందర్, పేర్ని వెంకటేశ్వర్లు, యువజన నాయకులు జడల కళ్యాణ్, రామారావు, హరీష్, గంగారబోయిన మురళి, పిల్లలమర్రి వెంకటేష్, మధు, పెద్దబోయిన సురేష్, సంపత్ పాల్గొన్నారు.