మధిర : మిర్చి క్వింటాలకు రూ.25వేల ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మందా సైదులు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలో మిర్చి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఖమ్మంలో మిర్చి బోర్డు(Chilli Board0 ఏర్పాటు చేయాలన్నారు. గత రెండు సీజన్లలో మిర్చి సాగు చేసి రైతులకు కనీస ధర లభించక పెట్టుబడును రాక ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. దీనికి తోడు వైరస్ ప్రభావం చేత తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు పండించిన మిర్చి పంటకు మార్కెట్లో ధర లేదా లేక వ్యాపారులే కృత్రిమ ధర ప్రకటించుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మిర్చికి ధర లేక ఇబ్బందులు పడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. ఈ సమస్యపై ఖమ్మం మిర్చి మార్కెట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్లు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వాల కళ్లు తెరిపించాలన్నారు.