కరకగూడెం, మే 07 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయలైన ఘటన గురువారం ఖమ్మం జిల్లా కరకగూడెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలంలోని తుమ్మలగూడెం గ్రామానికి చెందిన తోలెం రాంబాబు(32) ఇదే మండలంలోని మొగిలితోగు గ్రామంలో తన బంధువుల వివాహా వేడుకకు బైక్పై వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మొగిలితోగు మూలమలపు వద్ద కరకగూడెం నుండి మేడారం వైపు వేగంగా వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాంబాబు కుడికాలు విరడంతో పాటు తల నుండి రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించడంతో సిబ్బంది మణుగూరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.