ఖమ్మం రూరల్, ఏప్రిల్ 07 : ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మంగళగూడెం గ్రామంలో వరిగడ్డి కట్టలు కట్టే మిషన్‌లో పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగూడెం గ్రామం శివారు కొత్తూరుకు చెందిన వీరన్న తన పొలంలో మిషన్‌తో వరి గడ్డిని కట్టలు కట్టిస్తున్నాడు.
ఈ క్రమంలో గడ్డిని కట్టలు కట్టే మిషన్ జామ్ కావడంతో వీరన్న దానిని చేయితో క్లియర్ చేస్తున్న క్రమంలో చేయి ఒక్కసారిగా మిషన్‌లోకి వెళ్లి నుజ్జునుజ్జయింది. దీంతో సమీపంలో ఉన్న వారు చూసి వెంటనే వచ్చి వీరన్నను అతికష్టం మీద మిషన్ నుంచి తీసి హుటాహుటిన ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.