బోనకల్లు, మే 3: రాష్ట్రంలో రూ.21 వేల కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈస్కూల్స్ ఏర్పాటుతో రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, అప్రతిభా పాటవాలతో ప్రపంచంతోనే పోటీ పడే విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ స్కూల్స్ ఉద్ధేశ్యమన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 58 రెసిడెన్షియల్ స్కూల్స్‌ను మొదటి సంవత్సరంలోనే మం జూ రు చేసిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మధిర మార్కె ట్ కమిటీ చైర్మన్ బండారు నర్సింహారావు, డీపీవో ఆశాలత, ఆర్అండ్బీ ఈఈ తానేశ్వర్, తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్, ఎంపీడీవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ, మే 3: మండలంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం శంకుస్థాపన చేశారు. తొలుత మల్లన్నపాలెంలో రూ. 80 లక్షలతో పున:నిర్మించనున్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి, బాణాపురం గ్రామంలో రూ. 8.50 కోట్లు, 6.70 కోట్ల రోడ్డు నిర్మాణ పనులకు, ముదిగొండలో రూ.22 కోట్లతో నిర్మించనున్న 50 పడకల ఆస్పత్రికి, రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న పాల శీతలీకరణ కేంద్రం, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రారభించి నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పీ.శ్రీనివాస్‌రెడ్డి, ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి కళావతిబాయి, తహసీల్దార్ సునీత ఎల్జెబిత్, ఎంపీవో వాల్మీకి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం, మే 3 : ఉద్యోగులు, ప్రజల పక్షాన ఉండి వారి సమస్యల పరిషారం కోసం నిరంతరం కృషి చేస్తామని, వారిని కాపాడుకోవడం తమ బాధ్యత అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార అన్నారు. శనివారం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన ఉద్యోగసంఘ నాయకులు, ఉద్యోగులనిద్దేశించి మా ట్లాడారు. పెండింగ్ సమస్యల పరిషారం దిశగా కృషి చే స్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు సైదులు, రవీంద్రప్రసాద్, జయపాల్, విజయకుమార్, ప్రకాష్‌రావు, రమేష్, శ్రీనివాస్, రవికుమార్ పా ల్గొన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంను బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ కుల నాయకులు కలిసి సన్మానించారు.