ఖమ్మం, సెప్టెంబర్ 29 : మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనలో బీఆర్ఎస్ కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని వీడీఓస్ కాలనీలో గల క్యాంప్ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. ఖమ్మంలో అభివృద్ధి కార్యక్రమాల వద్ద ప్రజలను సమీకరించాలన్నారు. మంత్రి కేటీఆర్ సహకారం వల్లనే ఖమ్మం అభివృద్ధికి వేల కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మంత్రి కేటీఆర్ ఖమ్మం వస్తూనే ఉన్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ సహకారం, ప్రోత్సహం వల్లనే తనకు మంత్రి దండం వచ్చిందని, తద్వారా ఖమ్మంను అభివృద్ధి చేసుకోగలిగామని అన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, ఖమర్, పొన్నం వెంకటేశ్వర్లు, మాధవరావు పాల్గొన్నారు.
కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి
ఖమ్మం నగరంలో రూ.1,360 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వస్తున్న యువనేత, మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి పాల్వంచ కృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం వీడీఓస్ కాలనీలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన బీఆర్టీయూ ఆటో యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యండీవై పాషా, సెల్వరాజు, రమణ, ఆంజనేయులు, బ్రహ్మనాయుడు పాల్గొన్నారు.