Karepalli | గోదాం నిండిందని మొక్కజొన్న దింపని అధికారులు.. రైతుల అందోళన..!
కారేపల్లి : సోసైటీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రం ద్వారా ట్రాక్టర్లు, లారీలతో తీసుకొచ్చిన మొక్కజొన్న బస్తాలను అప్పాయిగూడెం గోదాంలో దించుకోకుండా ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
కారేపల్లి : మొక్కజొన్న రైతులు సోమవారం రాత్రి కారేపల్లిలోని గోదాం వద్ద అందోళనకు దిగారు. సోసైటీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రం ద్వారా ట్రాక్టర్లు, లారీలతో తీసుకొచ్చిన మొక్కజొన్న బస్తాలను అప్పాయిగూడెం గోదాంలో దించుకోకుండా ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. వే బ్రిడ్జి కాటా వద్ద రోజుల తరబడి వేచిచూస్తున్నామని సోమవారం వచ్చి గోదాం నిండిందని.. వేరే ప్రాంతాలకు మక్కలు తీసుకెళ్లాలని సోసైటీ వారి ద్వారా అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కారేపల్లిలోని జిన్నింగ్ మిల్లులో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతుల మొక్కజొన్న నిల్వ చేస్తున్నారు. కానీ, తమను మాత్రం 200 కిలోమీటర్ల దూరంలోని నల్గొండ జిల్లా చిలకమర్రి గోదాంకు వెళ్లాలని చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం నుండి బస్తా ý తరలింపునకు లారీలు రాక పోవటంతో తాము లారీలు, ట్రాక్టర్లలను తెప్పించుకోని గోదాంకు వస్తే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన చెందారు.
తమ మొక్కజొన్న బస్తాలను కారేపల్లిలోని గోదాంలో నిల్వ చేసేందుకు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన విషయం తెలిసి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, బీఆరఎస్ నాయకులు లాకావత్ లక్ష్మన్ రైతులు, అధికారులతో మాట్లాడారు. మక్కజొన్న రైతుల ఆవేదనను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లగా అయన స్పందించారు. మంగళవారం లోపు మక్క పంట కారేపల్లిలోనే దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

