కారేపల్లి : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి,జూలూరుపాడు, ఏన్కూరు, కొనిజర్ల,వైరా మండలాలలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు(బుధవారం)దుర్గామాత అన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. పలు ఆలయాలు, మండపాలు, చలువ పందిర్లలో కొలువైన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలలు, అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని మహా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
దుర్గామాత రోజుకో అవతారంలో దర్శనం ఇస్తుండడంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామాలలో ప్రత్యేక మండపాలు నిర్మించి నెలకొల్పిన దుర్గామాత విగ్రహాలకు తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తూ ప్రజలు తమ భక్తిని చాటి కుంటున్నారు. మండపాల వద్దకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.