మధిర, ఆగస్టు 26 : ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి తోడ్పడే ప్రతిభను ప్రోత్సహిస్తూ ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏడు డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లతో పాటు మెకానిక్, సిబ్బందికి అవార్డుల ప్రధాన కార్యక్రమం మంగళవారం మధిర డిపోలో నిర్వహించారు. మధిర ఆర్టీసీ డిపోలో ప్రగతి చక్ర పురస్కార అవార్డులను ఖమ్మం రీజినల్ మేనేజర్ హరి రామ్ మంగళవారం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్టీసీ సంస్థను ప్రగతి పథంలో నడిపించడం ఉద్యోగుల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఖమ్మం రీజియన్లో ఏడు డిపోలలో సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. ఇలాంటి ఉద్యోగులు ఉండడం వల్లే సంస్థకు గుర్తింపు, ప్రయాణికులకు సుఖ ప్రయాణం జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మరి డిపో మేనేజర్ శంకర్రావు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, అకౌంట్ ఆఫీసర్ జోస్నా, పర్సనల్ ఆఫీసర్ సంపత్ కుమార్, ఉమ్మడి ఖమ్మం సిబ్బంది పాల్గొన్నారు.