కారేపల్లి, అక్టోబర్ 13 : సైడ్ కాల్వలు లేక అంతర్గత రహదారులపై వర్షం నీరు నిలిచి చెరువులను తలపిస్తున్న ఘటన కారేపల్లి మండలం మాధారంలో కనిపిస్తుంది. మాధారం గ్రామంలో అంతర్గత రహదారులు సీసీ రోడ్లుగా మారినా వాటికి సైడ్ కాల్వలు నిర్మించలేదు. దీంతో మాధారం బొడ్రాయి సెంటర్ నుండి గోవింద్తండా వెళ్లు దారిపై వర్షపు నీరు నిలిచి పాదచారులు, వాహనదారులకు ఇబ్బందులు కల్గిస్తుంది. రోడ్డుపై నీరు నిలిచి ఇండ్లలోకి వెళ్తుండటంతో ఆప్రాంత నివాసులు ఇండ్లలోకి నీరు రాకుండా ఇండ్ల చుట్టూ మరం పోసుకోవల్సిన పరిస్ధితి కనిపిస్తుంది. గ్రామంలో సైడ్ కాల్వలు నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.