భవిష్యత్తు బీఆర్ఎస్దే..
భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ పేర్కొన్నారు. కేసీఆర్ కూడా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు.
- కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయం
- పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
- బీఆర్ఎస్లో చేరికల సభలో వైరా అభ్యర్థి మదన్‌లాల్
కొణిజర్ల, అక్టోబర్ 20: భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ పేర్కొన్నారు. కేసీఆర్ కూడా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. మండలంలోని తనికెళ్లకు చెందిన 4వ వార్డు సభ్యుడు లేడిబోయిన వెంకటేశ్వరరావు (సీపీఐ), 5వ వార్డు మెంబర్ పొట్లపల్లి చిన్నవెంకయ్య (కాంగ్రెస్)తోపాటు పలువురు నాయకులు.. స్థానిక సర్పంచ్ చల్లా మోహన్‌రావు నేతృత్వంలో మదన్‌లాల్ సమక్షంలో తనికెళ్లలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి మదన్‌లాల్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సజావుగా సాగాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు వై.చిరంజీవి, చల్లా మోహన్‌రావు, చల్లా నరసింహారావు, గుమ్మలపుడి శ్రీనివాసరావు, పొట్లపల్లి వెంకన్న, ఆకుతోట పుల్లారావు, కొర్లకంటి రవి, కమటాల ఎల్లయ్య, చెరుకుమల్లి రవి, అన్నారపు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, యాసా తిరుపతిరావు, లేడిబోయిన వెంకటేశ్వరరావు, ఏడుకొండలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

