సభ్యత్వ నమోదులో ఆదర్శంగా నిలపాలి
బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మధిర నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. రావినూతల గ్రామంలోని మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ స్వగృహంలో గురువారం మండల పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
- బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం మరింత కష్టపడి పనిచేయాలి
- మండల పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ కమల్ రాజు
బోనకల్లు, మే 21 : బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మధిర నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. రావినూతల గ్రామంలోని మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ స్వగృహంలో గురువారం మండల పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ అధినేత కేసీఆర్ డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు.
పార్టీ అభివృద్ధి కోసం ముందుకొచ్చి నిబద్ధతతో సభ్యత్వం తీసుకున్న వారే నిజమైన కార్యకర్తలని, వారంతా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. గత ఎన్నికల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 72 వేల ఓట్లు వచ్చాయని, అప్పుడు 50 వేల సభ్యత్వాలు చేర్పించామని, ఓటర్లు ఇంకా మనవైపే ఉన్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు.
ఇటీవల చింతకాని మండలం పాతర్లపాడులో మొక్కజొన్న అగ్నికి ఆహుతి అయినా.. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఆ రైతులకు పరిహారం అందించలేదంటే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతుల పక్షాన నిలిచి, పార్టీ అభివృద్ధి కోసం ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని ఆయన కోరారు. నాయకులు వేమూరి ప్రసాద్, ఇటికాల శ్రీనివాసరావు, పారా ప్రసాద్, కాకాని శ్రీనివాసరావు, వడ్డే నరేశ్, బంధం నాగేశ్వరరావు, గద్దల వెంకటేశ్వర్లు, కొమ్మినేని ఉపేందర్, తొండపు వేణు, జర్రిపూతల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

