ఎర్రుపాలెం, జనవరి 24: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని జడ్పీ, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కొండబాల కోటేశ్వరరావు దుయ్యబట్టారు. ఎర్రుపాలెంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ మండల కార్యదర్శి యన్నం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా ఉన్న నాయకులు సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రభుత్వ పథకాల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, చిత్తారు నాగేశ్వరరావు, పెంట్యాల పుల్లయ్య, చేబ్రోలు మల్లికార్జున్, శ్రీనివాస్‌రెడ్డి, శీలం కవిత, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, వేమూరి ప్రసాద్, మంకెన రమేశ్, శ్రీకాంత్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతిరావు, మస్తాన్‌వలీ, కృష్ణారావు, కోటా శ్రీనివాసరావు, నర్సింహ, సాంబశివరావు, గోపాల్‌రావు పాల్గొన్నారు.