బండి సంజయ్ రాజీనామా చేయాలి
కేంద్రమంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడైన సంజయ్ కొడుకు భగీరథ్ను పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడం దారుణమని అన్నారు. ఈ పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ తన కేంద్రమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని తన కొడుకును కాపాడుకుంటున్నారని ఆరోపించారు.
- కేంద్ర మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కొడుకును కాపాడుకుంటున్నారు
- ‘లైంగికదాడి’ నిందితుడిని ఇంకా అరెస్టు చేయకపోవడం దారుణం
- సంజయ్ కుమారుణ్ని వెంటనే అరెస్టు చేయాలి: లింగాల కమల్రాజు
మధిర, మే 11: కేంద్రమంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడైన సంజయ్ కొడుకు భగీరథ్ను పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడం దారుణమని అన్నారు. ఈ పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ తన కేంద్రమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని తన కొడుకును కాపాడుకుంటున్నారని ఆరోపించారు.
పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మధిరలోని బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్.. ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడడమే కాకుండా బాధితురాలి కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేయడం అత్యంత హేయమని మండిపడ్డారు. ప్రధాని సభ వద్ద ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు తేల్చిచెప్పినందునే పోలీసులు తప్పనిసరి పరిస్థితిలో స్పందించి కేసు నమోదు చేశారని అన్నారు.
పోక్సో కేసు నమోదైనప్పటికీ నిందితుడిని అరెస్టు చేయడంలో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమారుడిపై కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంజయ్కు పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లు కన్పిస్తోందని ఆరోపించారు.కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు చిత్తూరు నాగేశ్వరరావు, పల్లబోతుల వెంకటేశ్వరరావు, సయ్యద్ ఇక్బాల్, ధరావత్ మాధవి, చావా వేణుబాబు, వంకాయలపాటి నాగేశ్వరరావు, కటికల సత్యనారాయణ రెడ్డి, ఆళ్ల నాగబాబు, పాలవంచ రామారావు, బానోతు కృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

