ఖమ్మం :ఖమ్మంలో నూతనంగా జీవితభీమా సంస్థ హోంలోన్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం గట్టయ్య సెంటర్ వద్ద ఎల్ఐసీ హోం లోన్ కార్యాలయాన్ని ఖమ్మం బ్రాంచి ఆఫీస్ చీఫ్ మేనేజర్ శ్యాంసుందర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంటి రుణాలను తక్కువ వడ్డీ రేటుతో ఎల్ఐసీ హోం ఫైనాన్స్ ద్వారా పొందేందుకు అవకాశం ఉందన్నారు.
ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎల్ఐసీ బ్రాంచి అధికారులు, లియాఫీ నాయకులు పుసులూరి రమేష్‌బాబు, రామారావు, వెంకటరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.