మధిర, ఆగస్టు 29 : చిన్నపిల్లలను టీవీ వ్యాధి నుంచి కాపాడుకుందామని టీబీ అలర్ట్ ఇండియా, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ బి.వెంకటేశ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ గంటయ్య, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ సందీప్ అన్నారు. శుక్రవారం మధిర మండల పరిధిలోనిని పీహెచ్సీ దెందుకూరు, పీహెచ్సీ మాటూరు పేట ఆరోగ్య కేంద్రాల్లో తెలంగాణ స్టేట్ టీబీ నివారణ సంస్థ సూచనల మేరకు నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం ద్వారా టీబీ అలెర్ట్ ఇండియా సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నపిల్లలో టీబీ వ్యాధిని గుర్తించి చికిత్స అందించే విషయంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజ భాగస్వామ్యoతో టీబీ వ్యాధిని సంపూర్ణంగా అంతం చేయాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతంలో ఫీల్డ్ లెవల్ పారా మెడికల్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక చొరవతో చిన్న పిల్లల్లో క్షయ వ్యాధిని గుర్తింపునకు అన్ని విధాలుగా సహకరించాలన్నారు.
ప్రత్యేక యాప్, క్యూ ఆర్ కోడ్ తో టీబీ మందులు వాడే పేషెంట్ ఇంట్లో 14 సంవత్సరాల పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి లోపించి, బలహీనంగా ఉండి టీబీ లక్షణాలు ఉంటే వారి వివరాలు ఆన్లైన్ చేసి టీబీ అలెర్ట్ ఇండియా సంస్థకు వివరాలు పంపాలన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్స్, ఫ్లిప్ ఛార్ట్స్, కర పత్రాలు సిబ్బందికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పృథ్వీనాయక్, డాక్టర్ రంజిత్, సీడీపీఓ బాల త్రిపుర సుందరిదేవి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వి.వెంకటేశ్వర్లు, హెచ్ఇఓ గోవింద్, పీహెచ్సీల ఆరోగ్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది, మధిర టీబీ యూనిట్ సిబ్బంది, ఆర్ బి ఎస్ కే సిబ్బంది పాల్గొన్నారు.