కూసుమంచి(నేలకొండపల్లి), నవంబర్ 3: మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, సీపీఎంల నుంచి 35 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ నుంచి ఖమ్మం కాంతారావు,నర్సయ్య, గుండెబోయినచ సైదులు, పసుపులేటి బజార్, శ్రీను, సీపీఎంకు చెందిన యూత్ నాయకులు కిశోర్తోపా టు 35 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరా యి. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, ఎంపీపీ వజ్జా రమ్య, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ నంబూరి శాంత, సర్పంచ్ రాయపుడి నవీన్ హుస్సేన్, నాయకులు పాల్గొన్నారు.
కూసుమంచి, నవంబర్ 3: పలు పార్టీల నుంచి ఎమ్మెల్యే కదాళ ఉపేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మండలంలోని గోరీలపాడు తండా, బోడియా తండాల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్స్ పార్టీలో చేరారు. ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే కందాళను గోరీలపాడు తండాకు ఆహ్వానించి పార్టీలోకి చేరుతామని ప్రకటించడంతో వారికి గులాబీ కండువాలు కప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం పని చేస్తామని, కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వారు ఎమ్మెల్యేకు తెలిపారు.
కూసుమంచి మండలం బోడియాతండా నుంచి ఇద్దరు వార్డు సభ్యులతో సహా 24 కుటుంబాలకు చెందిన వారు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తండా వార్డు సభ్యులు భూక్యా రవి, బదావత్ భావుసింగ్, సీపీఎం నాయకులు భూక్యా మచ్చు, టీడీపీ నాయకులు అంగోత్ హనుమ, వెంకన్న తదితరులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎస్ ఉపేందర్ రెడ్డి,మనోహర్ రెడ్డి, ఎంపీపీ బాణోత్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, కార్యదర్శి ఆసీఫ్, సర్పంచ్ సరస్వతి పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, అక్టోబర్ 3: ‘వాడవాడకు కందాళ యువసేన’ అనే నినాదంతో శుక్రవారం కందాళ యూత్ అసోసియేషన్ నాయకులు మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో యువసేన ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు ఆదేశాల మేరకు మేకల ఉదయ్ ఆధ్వర్యంలో యువత మండలంలో ద్విచక్ర వాహనాలతో ప్రచారం చేశారు. మండలంలోని తెల్దారుపల్లి, తల్లంపాడు, పొన్నెకల్, మద్దులపల్లి, వెంకటగిరి, గుదిమళ్ల ఇందిరమ్మకాలనీ, గుర్రాలపాడు గ్రామ ప్రజలను కలిసి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేకల ఉదయ్ మాట్లాడుతూ.. మండలంలో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ ఆదరణ కనబడుతుందన్నారు. ప్రచారంలో కందాళ యూత్ అసోసియేషన్ బాధ్యులు తుపాకుల సాయి, బానోత్ వికాస్, గుడెల్లి అభి, సప్పిడి ప్రభాస్, జల్లి అశోక్, జల్లి ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.