కారేపల్లి : తెలంగాణ ప్రభుత్వం రైతు భూమికి భద్రత కల్పించటానికి రూపొందించిన భూ భారతి (Bhu Bharati ) లో పేరుంటే భూమి హక్కు భద్రత ఉన్నట్లేనని తెలంగాణ భూ భారతి రూపకర్త, రైతు కమిషన్ సభ్యులు భూమి సునిల్‌కుమార్( Sunil Kumar) అన్నారు. భూభారతి, రైతుహక్కులపై శనివారం కామేపల్లి,కారేపల్లి మండలం అప్పాయిగూడెం రైతు వేదికలో అవగాహన సదస్సు జరిగింది.
ఈసదస్సులో సునిల్‌కుమార్ మాట్లాడుతూ రైతు భూమికి భద్రత, భరోసా కోసం తీసుకవచ్చిందే భూ భారతి అని అన్నారు. భూములకు హక్కు కల్పించటానికి భూ భారతిలో అవకాశం కల్పించామని వివరించారు. భూ రెవెన్యూ సదస్సులలో 30 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని ఆశించామని, రైతులకు సరైన అవగాహన లేక కేవలం 8.44 లక్షలు మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారని వివరించారు.
వ్యవసాయం జీవనవిధానం నుంచి వ్యాపారంగా రూపారంతరం చెందిందని పేర్కొన్నారు. రాష్ట్రలో 10 లక్షల ఎకరాలలో కార్పొరేట్ సంస్థలతో ఒప్పంద వ్యవసాయం సాగుతుందన్నారు. ఈ ఒప్పంద వ్యవసాయానికి ఎలాంటి ఎంవోయూ లేక పోవటంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ (Vaila MLA Ramdas Nayak) మాట్లాడుతూ ప్రాంతాల వారీగా చట్టాలు ఉన్నాయని వాటిని కాపాడుకుంటునే భూ భారతి పటిష్టంగా అమలు జరుగుతుందన్నారు.
ఈకార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, అడ్డగోడ ఐలయ్య, బానోత్ హీరాలాల్, తహసీల్ధార్ అనంతుల రమేష్, ఎంపీడీవో మల్లెల రవీంద్రప్రసాద్, ఏవో బట్టు అశోక్‌కుమార్, నాయకులు తలారి చంద్రప్రకాష్, బానోత్ నాయక్, ఇమ్మడి తిరుపతిరావు, మేదరి వీరప్రతాప్, మల్లెల నాగేశ్వరరావు, గుగులోత్ భీముడు, అంగోత్ మత్రు, మంగ్యా, ఈర్య, రూప్లా తదితరులు పాల్గొన్నారు.