‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో బలైన కూలీలు’
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు, పేదలే తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు...
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు
కారేపల్లి, సెప్టెంబర్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు, పేదలే తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కారేపల్లి మండలం మాణిక్యరంలో శుక్రవారం జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకిచ్చిన అనేక హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీల అమలుకు ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి విఫలమైనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశంలో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో ఆందోళనలు, పోరాట కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు యనమనగండ్ల రవి, కేసగాని ఉపేందర్, పండగ కొండయ్య, కరపట్టి సీతారాములు, పోతర్ల నాగేశ్వరరావు, చల్ల మల్లమ్మ, భూక్య రమేశ్, పాయం వెంకన్న, షేక్ సైదులు, దాసరి మల్లయ్య, పాసిని నాగేశ్వరరావు, అన్నారపు కృష్ణ, పోతురాజు చందర్రావు, రేమల్ల వీరస్వామి, కరపటి అరుణ, ఈసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

