హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: కాకతీయ యూనివర్సిటీ పార్ట్ టైమ్ లెక్చరర్స్ సంఘం(KUPLA) ఎన్నికలు నిర్వహించాలని వివిధ విభాగాల అధ్యాపకులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రంను కలిసి వినతిపత్రం అందజేశారు. గత కమిటీ రద్దవ్వడం, కొత్త కమిటీ ఎన్నిక వాయిదా పడినందున అడ్మినిస్ట్రేషన్‌కి, పార్ట్‌టైం టీచర్స్‌కు మధ్య సమన్వయం కుదరలేదని అధ్యాపకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి.. వెంటనే కుప్లా ఎన్నికలు జరపాలని రిజిస్ట్రార్‌ను కోరారు.
కాకతీయ యూనివర్సిటీలో కుప్లా ఎన్నికలు జరపాలని అధ్యాపకులు రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రంను కలిసి వినతి పత్రం ఇచ్చారు. యూనివర్సిటీలో సుమారుగా 150కిపైగా వివిధ విభాగాల్లోని అధ్యాపకుల కోసం పనిచేసే కమిటీ లేకపోవడంతో అడ్మినిస్ట్రేషన్‌కు తమ సమస్యలు తెలియడంలేదని వారు రిజిస్ట్రార్‌కు తమ గోడును వినిపించారు. ఈ విషయంపై స్పందించిన రిజిస్ట్రార్ రామచంద్రం గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను పరిశీలించి ఆ విధంగా ముందుకు పోదామని చెప్పారని వారు పేర్కొన్నారు.