కారేపల్లి, సెప్టెంబర్ 11 : అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ కుటుంబానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం రూ.30 లక్షల చెక్కును అందజేశారు. అటవీ శాఖ అమరుల దినోత్సవంను పురస్కరించుకుని హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, అటవీ శాఖ రాష్ట్ర అధికారుల చేతుల మీదుగా ఎఫ్ బి ఓ నవీన్ సతీమణి ప్రమీలకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటియా తండాకు చెందిన మాజీ ఎంపీపీ దేవుల నాయక్, బానోతు నవీన్, మంగళం కంపెనీ జనరల్ మేనేజర్ రాజేందర్, అడ్డగోడ ఐలయ్య యాదవ్, అడపా పుల్లారావు, సుధాకర్ పాల్గొన్నారు.