బొగ్గు గనులను వేలం వేస్తే ఊరుకోం
జాతీయ సంపద అయిన బొగ్గు గనులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం వేయాలని చూస్తోందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేదిలేదని, సింగరేణి ప్రైవేటీకరణను జరగనివ్వమని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- కేంద్రప్రభుత్వంపై వెల్లువెత్తిన నిరసనలు
పాల్వంచ, జూన్ 22 : జాతీయ సంపద అయిన బొగ్గు గనులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం వేయాలని చూస్తోందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేదిలేదని, సింగరేణి ప్రైవేటీకరణను జరగనివ్వమని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాల్వంచ పట్టణంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డా రవి, పట్టణ కార్యదర్శి సత్య మాట్లాడుతూ దేశంలోని 60 బొగ్గు బావులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు చూస్తోందని, అన్నిరంగాల కార్మికులు ఉద్యమించాలని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గనులశాఖ పదవి చేపట్టగానే తెలంగాణకు తీరని అన్యాయం చేయబోతున్నారని విమర్శించారు. శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలం వేయడం శోచనీయమన్నారు. నిరసన కార్యక్రమంలో గట్టయ్య, మహేశ్, సాయి, శ్రీను, సామేలు పాల్గొన్నారు.
సత్తుపల్లిలో..
సత్తుపల్లి, జూన్ 22 : సింగరేణి జీవీఆర్ ఓసీ వద్ద ఐఎన్టీయూసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను సింగరేణి జనరల్ సెక్రటరీ త్యాగరాజన్, కొత్తగూడెం ఏరియా వైస్‌ప్రెసిడెంట్ రజాక్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఐఎన్టీయూసీ సహించదని, వాటికి వ్యతిరేకంగా కార్మికులకు మేలు కలిగేలా సింగరేణి మనుగడను కాపాడుదామన్నారు. రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను కేవలం సింగరేణికి మాత్రమే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ రామారావు, బ్రాంచి సెక్రటరీ యర్రా భట్టి విక్రమార్క, క్రాంతికుమార్, నాగప్రకాశ్, చెన్నకేశవ, బాలాజీ, నగేశ్, సమ్మయ్య, కోటి, ఐ.వీ.రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.
టేకులపల్లిలో..
టేకులపల్లి, జూన్ 22 : మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి ఆధ్వర్యంలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షుడు నాగలక్ష్మి, జయ, పాపమ్మ, మంగి, అచ్చి, బుల్లి, సోన, విజయ, భారతి, సుజాత, భారతి పాల్గొన్నారు.
దమ్మపేటలో..
దమ్మపేట, జూన్ 22 : దమ్మపేటలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో జయ, నాగేంద్ర, అరుణ పాల్గొన్నారు.
కొత్తగూడెంలో..
కేంద్రంలోని బీజేపీ సర్కార్ 60 బొగ్గు బ్లాక్‌లను వేలానికి పెట్టిందని, వెంటనే ఆపాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు పేర్కొన్నారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి డి.వీరన్న అధ్యక్షతన జరిగిన హెడ్డాఫీస్ ఎదుట ధర్నాలో ఆయన మాట్లాడారు. ఈ వేలాన్ని అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాలని, ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏజే రమేశ్, బ్రహ్మచారి, సూరం ఐలయ్య, భూక్యా రమేశ్, విజయగిరి ఎణివాస్, గాజుల రాజారావు, కాంట్రాక్టు కార్మిక సంఘం బ్రాంచి అధ్యక్షుడు గడ్డం శ్యాంకుమార్, ప్రభాకర్, రమణ భాస్కర్, కొత్తపల్లి రమేశ్‌బాబు, సమ్మయ్య, నాజర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

