బోనకల్లు/ కూసుమంచి/ కూసుమంచి రూరల్, జూన్ 27: దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని జడ్పీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. అందుకే దేశమంతటా బీఆర్ఎస్కు ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 80 కుటుంబాల వారు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. వీరికి చైర్మన్లు లింగాల, కొండబాల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని గమనిస్తున్న ఇతర పార్టీల వారు కూడా బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. తాజా చేరికలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, వేమూరి ప్రసాద్, మోదుగుల నాగేశ్వరరావు, తమ్మారపు బ్రహ్మయ్య, జాన్‌బీ, బాణోతు కొండ, దొప్పా కృష్ణ, హుస్సేన్, దొడ్డా నాగేశ్వరరావు, పండుత సీతారాములు, నజీర్, ఇబ్రహీం, రఫీ, బంధం నాగేశ్వరరావు, రుక్మాసాబేగం, జానీమియా, పర్వతాచారి, బోయినపల్లి వెంకటరాజ్యం తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి మండలం ముత్యాలగూడెం సర్పంచ్ (కాంగ్రెస్) బొల్లికొండ శ్రీనుతోపాటు పలువురు ప్రముఖులు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సమక్షంలో మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే కందాళ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ.. కొద్ది రోజుల కిందట ముత్యాలగూడెంలో కంఠమల్లేశ్వరస్వామి గుడి ప్రతిష్ఠ సమయంలో జరిగిన ఘర్షణలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కుక్క శ్రీను, బడేటి సురేశ్, పాసిని సురేశ్, కుక్క రాజేశ్, బొల్లికొండ రాములు, ఊరుగు పాపారావు తదితరులు ఉన్నారు. డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఎంపీటీసీ ఊడుగు జ్యోతి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు నల్లమోతు శ్రీనివాసరావు, చాగంటి శ్రీను పాల్గొన్నారు.