ఖమ్మం: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన జరగాల్సిన పరీక్షలను రద్దుచేశారు. సద్దుల బతుకమ్మ సందర్బంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల విభాగం కంట్రోలర్ మల్లారెడ్డి తెలిపారు. ఈ పరీక్షను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని వారు సూచించారు.