KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
KTR | ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కర్నె ఆదినారాయణ, అనిత దంపతుల 13 ఏళ్ల కుమారుడు కర్నె వినయ్ ప్రస్తుతం బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. కేటీఆర్‌ను కలవాలని, ఆయనతో ఒక ఫోటో దిగాలన్నది వినయ్ కోరిక.
KTR | బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడికి నేనున్న అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. నేను నీకు అండగా ఉంటా.. భయపడకు అంటూ భరోసానిచ్చారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కర్నె ఆదినారాయణ, అనిత దంపతుల 13 ఏళ్ల కుమారుడు కర్నె వినయ్ ప్రస్తుతం బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. కేటీఆర్‌ను కలవాలని, ఆయనతో ఒక ఫోటో దిగాలన్నది వినయ్ కోరిక. అయితే స్థానిక నేతల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ వెంటనే వినయ్ పరిస్థితిని, అతడి కోరికను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కందాల ఉపేందర్ వినయ్ కుటుంబసభ్యులను కేటీఆర్‌ను కల్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ హాయ్ వినయ్ అని ఆప్యాయంగా పలకరించారు. ఎన్నో క్లాస్ చదువుతున్నవ్ అని అడిగితే ఎనిమిదో తరగతి అని చెప్పాడు వినయ్. ఏం కాదు.. మంచిగైతవ్.. బాధపడకు.. మందులేసుకో.. నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. అని గిఫ్ట్ ప్యాక్‌ను వినయ్‌కు అందించారు కేటీఆర్. ఏం బాధపడొద్దమ్మా.. వినయ్‌కు ఉత్తమ వైద్యం అందించేలా ప్రయత్నం చేస్తాం.. అంటూ వినయ్ తల్లిదండ్రులకు హామీనిచ్చారు. బాలుడికి అవసరమైన మెరుగైన వైద్య సహాయం అందేలా చూస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
నేను నీకు అండగా ఉంటా.. భయపడకు!
బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడికి @KTRBRS భరోసాఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కర్నె ఆదినారాయణ, అనిత దంపతుల 13 ఏళ్ల కుమారుడు కర్నె వినయ్ ప్రస్తుతం బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవాలని, ఆయనతో ఒక ఫోటో దిగాలన్నది వినయ్ కోరిక.
ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్.. వెంటనే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి వినయ్‌కు ఆ అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా వినయ్‌తో ఆప్యాయంగా మాట్లాడిన కేటీఆర్, అతనికి ఎంతో ధైర్యం చెప్పారు.
అంతేకాకుండా, బాలుడికి అవసరమైన మెరుగైన వైద్య సహాయం అందేలా చూస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
— BRS Party (@BRSparty) October 17, 2026
Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

