భద్రాచలం, జూలై 21: కోయభాష అంతరించి పోకుండా కాపాడు కోవాల్సిన బాధ్యత గిరిజనులపై ఉందని ఐటీడీఏ పీవో బీ రాహుల్ అన్నారు. ఆదివారం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్లో నిర్వహించిన కోయ భాషా దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిపిలేని కోయ భాషకు వివిధ రాష్ర్టాల అధికార భాషలను కలిపి నిఘంటువు తయారు చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. త్వరలో అన్ని పాఠశాలల్లో కోయ భాషలో విద్యను బోధించేలా ప్రయత్నాలు ప్రారంభిస్తామన్నారు.