వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే గెలుపు
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్దే గెలుపని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో తెలంగాణను చూస్తే తెలుస్తోందని గుర్తుచేశారు.
- అభివృద్ధి, సంక్షేమమంటే ఏంటో తెలంగాణను చూస్తే తెలుస్తోంది
- ఇళ్ల స్థలం పొందిన వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలి
- స్థలాల పంపిణీలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ కొత్తగూడెం అర్బన్/ రామవరం, అక్టోబర్ 3:తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్దే గెలుపని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో తెలంగాణను చూస్తే తెలుస్తోందని గుర్తుచేశారు. భూమి, ఇళ్లు కోల్పోయిన ప్రతి నిర్వాసితుడికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అందులో భాగంగానే ప్రతి అర్హుడికీ వంద గజాల చొప్పున ఇంటి స్థలాన్ని ఇస్తున్నామని అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ 5వ వార్డులోని గంగాబిషన్బస్తీలో మంగళవారం ఏర్పాటు చేసి కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు.
సింగరేణి స్థలాల్లో అక్రమంగా స్థిర నివాసం ఏర్పరచుకొని దశాబ్దాలుగా ఉంటున్న మాయబజార్, ఎస్ఆర్టీ కాలనీ, వనమా నగర్ రైల్వే నిర్వాసితుల విషయాన్ని తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ ఇళ్ల స్థలాల కేటాయింపునకు ప్రత్యేకంగా జీవోను జారీ చేశారని గుర్తుచేశారు. సుమారు 400 మందికి ఇళ్ల స్థలాలను అందిస్తున్నామని, సర్వేకు వచ్చినప్పుడు అందుబాటులో లేకుండా, ఇతరత్రా కారణాల వల్ల అందుబాటులో లేని అర్హులైన 60 మందికి మరొకొన్ని రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇస్తామని అన్నారు. ఇళ్ల స్థలాలు పొందినవారంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.
ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, సింగరేణి అధికారులు కాపు సీతాలక్ష్మి, కంచర్ల చంద్రశేఖర్‌రావు, శాలెంరాజు, వేల్పుల దామోదర్, బాదావత్ శాంతి, గుమ్మడి సాగర్, ఇల్లా పరమేశ్, ఆర్తీ మక్కడ్, భూక్యా రాంబాబు, శిరీష, దొడ్డా పుల్లయ్య, జీ.రఘు, కౌడగాని పరమేశ్, అంబుల వేణు, బండి నర్సింహారావు, మాచర్ల రాజకుమారి, అనిల్, దూడల బుచ్చయ్య, నిమ్మల సాగర్, ఎండీ రజాక్, నిమ్మల రాజేశ్వరరావు, జేవీఎస్ చౌదరి, కాపు కృష్ణ, గూడెల్లి యాకయ్య, తొగరు రాజశేఖర్, సంకుభాపన అనుదీప్, రాసపల్లి రాజేంద్రప్రసాద్, కాసుల వెంకట్, భీమా శ్రీధర్, కంభంపాటి దుర్గాప్రసాద్, ఎంఏ రజాక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

