కారేపల్లి, ఏప్రిల్ 02 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ దేవాలయంలో మూడు రోజులపాటు కొనసాగిన అమ్మవారి బ్రహ్మోత్సవాలు బుధవారం పరిసమాప్తి అయ్యాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, చక్రతీర్థం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు కొత్తలంక కైలాస శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు భక్తులచే సామూహిక పూర్ణాహుతి హోమ పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పర్స పట్టాభి రామారావు మాట్లాడుతూ.. ఆలయ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసినట్లు చెప్పారు. సహకరించిన భక్తులు, గ్రామస్తులు, ఆలయ సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చివరిరోజు ఇల్లెందు పట్టణానికి చెందిన సింగరేణి మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరన చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు కె.వేణుగోపాలచార్యులు, పగడాల మోహన్ కృష్ణ, పర్స సాయి పాల్గొన్నారు.
Kotamaisamma Thalli : కోటమైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం