కారేపల్లి, అక్టోబర్ 04 : ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి జాతర మూడో రోజు శనివారం జోరుగా కొనసాగుతుంది. జాతరకు జన తాకిడి విపరీతంగా పెరిగింది. రాత్రి సమయంలో జాతర చూడటానికి మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు వేలాదిగా తరలి వస్తుండడంతో జాతర జనంతో కిక్కిరిసి పోయింది. సీఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ బైరు గోపీ ఆధ్వర్యంలో పోలీసులు రేయింబవళ్లు బందోబస్తు నిర్వహిస్తూ జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూస్తున్నారు. వాహనాలను కోటమైసమ్మ ఆర్చీ వద్దే నిలిపివేసి ట్రాఫిక్‌ను నియంత్రణలో ఉంచారు. వినోద సాధనాల వైపు ప్రజలు మక్కువ చూపిస్తున్నారు.
Karepally : జోరుగా కొనసాగుతున్న కోటమైసమ్మ తల్లి జాతర