Kota Maisamma Jathara | కారేపల్లి, అక్టోబర్ 5: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతర హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రతి ఏడాది విజయదశమి(దసరా)ను పురస్కరించుకొని ఇక్కడ ఐదు రోజులపాటు అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈనెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన కోట మైసమ్మ జాతరకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించగా పెద్ద వాహన పూజలకు రూ.1,82,800, ద్విచక్ర వాహన పూజలకు రూ.1,89,100, గోత్ర నామార్చన పూజలకు రూ.42,360, కుంకుమార్చన పూజలకు రూ.81,030, వేలం పాట హక్కుల ద్వారా కొబ్బరికాయలు పూజ సామాగ్రికి రూ.3,14,000,లడ్డు పులిహారకు రూ.1,51,000, మిఠాయిలకు రూ.2,10,000, పుట్నాలకు రూ.72,000, ఐస్ క్రీమ్ లకు రూ.36,500, కొబ్బరి చిప్పలకు రూ.1,81,000, హుండీ ఆదాయం రూ.7,41,764, జాతరలు దుకాణాల స్థల ఏర్పాటు కిరాయిలకు రూ.5,40,650, విరాళాలు రూ. 3,696, చీరల వేలం రూ.80,486, వాహన పూజలు చేయు పూజారుల లైసెన్సులకు రూ. 84,000 ఆదాయం వచ్చింది.
Kota Maisamma Temple2
ఈ కార్యక్రమంలో పర్సా ట్రస్ట్, దేవాలయ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు, దేవాదాయ,ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఈ.వెంకటేశ్వరరావు, ఆలయ కార్యనిర్వాహణాధికారి కె. వేణుగోపాలాచార్యులు తో పాటు దేవాదాయ శాఖ సిబ్బంది, పరాకమని సేవకులు తదితరులు పాల్గొన్నారు.