కారేపల్లి, మార్చి 20 : ఖమ్మం జిల్లా సింగిరెడ్డి మండల పరిధిలో గల ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ దేవాలయంలో శుక్రవారం నుండి అమ్మవారి పవిత్ర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకుడు కొత్తలంక కైలాస శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేక పూజలు చేసి బ్రహ్మోత్సవ ప్రత్యేక పూజలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు కొనసాగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు భారీ సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఇల్లెందు పట్టణానికి చెందిన రావుస్ మల్టీ స్పెషాలిటీ యాజమాన్యం రవి-కల్పన రావు, కాకతీయ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం దండ రామచందర్ అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పర్స పట్టాభి రామారావు, ఈఓ వేణుగోపాలాచారి, దేవాదాయ సిబ్బంది పగడాల మోహన్ కృష్ణ, పర్సా సాయి, అన్నప్రసాద కార్యక్రమ నిర్వహణ కన్వీనర్ తాటిపల్లి సుబ్బారావు, ఎలుగురు మధు బాబు, సైఫా రాజశేఖర్, గందే సురేశ్, చందా చక్రధర్, నూక ఆనందరావు, అర్వపల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.

కోట మైసమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం